ప్రధాని మోడీకి ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

V6 Velugu Posted on Dec 03, 2021

కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు  ప్రధాని మోడీకి  ట్వీట్ చేసిన కేటీఆర్.  కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్  చాలా సార్లు విజ్ఞప్తి చేసినా  పట్టించుకోలేదన్నారు.అంతేగాకుండా ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టులను గుర్తించారన్నారు. ఈ నెల 6 న జరగనున్న హైపవర్ స్టీరింగ్ కమిటీ మీటింగ్ లో తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలనే వినతులను పరిగణలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు.

చేసి

Tagged Prime Minister Modi, KTR Tweet, Kaleswaram, Palamuru projects

Latest Videos

Subscribe Now

More News