పెండింగ్ ప్రాజెక్టులను స్పీడప్ చేయండి..కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌కు కేటీఆర్ విజ్ఞప్తి 

పెండింగ్ ప్రాజెక్టులను స్పీడప్ చేయండి..కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌కు కేటీఆర్ విజ్ఞప్తి 
  • కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు సహకరించాలని రిక్వెస్ట్

న్యూఢిల్లీ, వెలుగు: పెండింగ్‌‌లో ఉన్న తెలంగాణ  రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో భాగంగా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు దామోదర్‌‌‌‌ రావు, పార్టీ సీనియర్ నేత జాన్సన్ నాయక్, ఇతర నేతలు తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం అందజేశారు.

కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమకు రాజకీయాల కంటే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమని పేర్కొ న్నారు. అందుకే రాష్ట్ర ప్రజల తరఫున రైల్వే, ఐటీ రంగాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలి పారు. ప్రతిపాదిత కాజీపేట డివిజన్‌‌లో కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్, కాజీపేట–ఎర్రుపాలెం, డోర్నకల్–మణుగూరు, మోతమర్రి–విష్ణుపురం, కాజీపేట–వంగపల్లి రైల్వే సెక్షన్లను చేర్చాలని సూచించినట్టు చెప్పారు.

ఈ డివిజన్ పరిధి సుమారు 2 వేల ట్రాక్ కిలోమీటర్ల వరకు ఉంటుందని వివరించారు. కేవలం 900 కిలో మీటర్లతో గుంటూరు డివిజన్, సుమారు 2,200 కిలోమీటర్లతో విజయవాడ, గుంతకల్ డివిజన్లు కొనసాగుతున్న నేపథ్యంలో కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయడం పరిపాలనాపరంగా, అభివృద్ధిపరంగా ఎంతో ప్రయోజనకరమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు.

మిషన్ మోడ్‌‌లో పూర్తి చేయాలి 

సిరిసిల్ల నియోజకవర్గానికి కీలకమైన 151 కిలో మీటర్ల మనోహరాబాద్–సిద్దిపేట–సిరిసిల్ల– వేములవాడ– కొత్తపల్లి న్యూ బ్రాడ్ గేజ్ రైల్వే ప్రాజె క్టును అత్యవసరంగా పూర్తి చేయాలని మంత్రిని కోరినట్టు కేటీఆర్‌‌‌‌ తెలిపారు. సిరిసిల్ల టెక్స్‌‌టైల్ పరిశ్రమకు, దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ దేవస్థానానికి ఈ రైల్వే లైన్ అత్యంత కీలకమని చెప్పారు. రైల్వే అంశాలతోపాటు తెలంగాణ టైర్‌‌‌‌–-2 ఐటీ నగరాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయుడు, తొలిసారిగా బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజు సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

హైడ్రా ఓ వేట కుక్కదాన్ని ఉసిగొల్పి డబ్బులు దండుకుంటున్నరు: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా ఒక వేట కుక్క అని, ఆ వేట కుక్కను ఉసిగొల్పి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా అనేది నిజంగా రేవంత్ చెప్పినట్టు సంస్కరణ అయితే, ముందు ఆయన అన్న తిరుపతిరెడ్డి ఇల్లు ఎందుకు కూల్చ లేదన్నారు. అన్నకు హైకోర్టు స్టే ఉందని చెప్తు న్న సీఎం, అదే హైకోర్టు స్టే ఉన్న వేరే వాళ్ల ఇండ్లు మాత్రం అన్యాయంగా ఎందుకు కూల్చేస్తున్నారని ప్రశ్నించారు.

మంగళవారం ఢిల్లీలో కేటీఆర్​ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రేవంత్‌‌ రెడ్డి కొడంగల్, రెడ్డికుంటలో కట్టిన ఇల్లు, కొందరు మంత్రులు, శాసనమండలి చైర్మన్‌‌ సుఖేందర్‌‌ రెడ్డి ఎఫ్టీఎల్‌‌లో కట్టిన ఇడ్లను కూల్చమని చెప్పండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు’’ అని కేటీఆర్ అన్నారు. ‘హైడ్రా’పై 65 సార్లు హైకోర్టు చెప్పినా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లర్​ అన్నట్టుగా సీఎం వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. హైకోర్టు చెప్పి 24 గంటలైందని, 
ఇంకా రంగనాథ్‌‌ను కొనసాగించడం.. ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రహస్య మిత్రులంతా బీజేపీ నేతలే అని విమర్శించారు.