సిరిసిల్ల టౌన్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గురువారం పర్యటించారు. జగ్గారావుపల్లిలోని పెద్దమ్మ టెంపుల్‌లో విగ్రహా ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం సిరిసిల్లలోని పలు వివాహా వేడుకల్లో పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. అంతకుముందు వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలోని సీతారామచంద్ర ప్రాణ ప్రతిష్ఠ, బంజేరు గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వీర్నపల్లి మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎడ్లసాగర్ కుమారుడి పెళ్లి వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్, చైర్ పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ స్టేట్ లీడర్ చీటీ నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య , పట్టణ అధ్యక్షుడు చక్రపాణి , టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు పాల్గొన్నారు.