
- ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తన భాష, యాస మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన బట్టలూడదీసి కొడ్తారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్‌లో ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పదేపదే రేవంత్ దమ్ము గురించి మాట్లాడుతున్నారని, సీఎం దమ్మేంటో ఈ దేశం మొత్తానికి తెలుసన్నారు.