కేటీఆర్‌కు క్రేజ్ ఎక్కువ.. కేసీఆర్ తర్వాత ఆయనే సీఎం

కేటీఆర్‌కు క్రేజ్ ఎక్కువ.. కేసీఆర్ తర్వాత ఆయనే సీఎం

మంత్రి  శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అని అన్నారు. దేశం కేసీఆర్ వైపు..యువత కేటీఆర్ వైపు చూస్తుందన్నారు. కేటీఆర్ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ప్రజాధరణ ఉన్న నేత అని అన్నారు. ప్రజల గురించి విజన్ ఉన్న నేత కేటీఆర్ అని అన్నారు.

సొంత కుటుంబాన్ని గెలిపించుకునే సత్తా లేని ఉత్తమ్ తమ నాయకుని గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు? రెచ్చగొట్టడం,కులమతాల మద్య చిచ్చు పెట్టడం ప్రతిపక్షాలకు కామన్ అయ్యిందన్నారు. సెంటిమెంట్ ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందన్నారు. అభివృద్ది చేయాలి అనుకుంటే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏమి ఇవ్వకున్నా కేసీఆర్, కెటిఆర్ లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు.