మంత్రివర్గానికి శుభాకాంక్షలు : కేటీఆర్

మంత్రివర్గానికి శుభాకాంక్షలు : కేటీఆర్

ఇవాళ ప్రమాణం చేసిన కొత్త మంత్రులకు ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులను అభినందించారు. ‘కొత్త మంత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యవేక్షణలో మీరంతా తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని ట్వీట్ చేశారు. రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ నరసింహన్‌.. ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డిలతో ప్రమాణం చేయించారు.