అత్యాచార కేసుల్లో ఏ ఒక్క నిందితుడికి బెయిల్ రాకూడదు

అత్యాచార కేసుల్లో ఏ ఒక్క నిందితుడికి బెయిల్ రాకూడదు

రేపిస్టులు దోషులుగా తేలినప్పుడు వారు మరణించే వరకు జైలులోనే ఉండాలని, అందుకు అనుగుణంగా చట్టాలను సవరించాలని మంత్రి  కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘‘ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అత్యాచారం కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది ? ఆ కేసులో నిందితులు బయటే ఉన్నారు’’ అంటూ కొందరు నెటిజన్లు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.‘‘నిందితులను వేగంగా అరెస్టు చేసి వారిని జైలుకు పంపాం. 45 రోజుల తర్వాత హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఈ రేపిస్టులను చట్ట ప్రకారం శిక్షించే వరకు పోరాడుతాం’’ అని  మంత్రి ట్వీట్ చేశారు.

జువెనైల్ జస్టిస్ యాక్ట్, IPC & CrPCలోని లొసుగుల ఫలితంగా  నిందితులు అత్యాచార కేసుల్లో బెయిల్‌పై బయటికి రావడానికి కారణమవుతున్నాయని కేటీఆర్ అన్నారు. అందుకే ఈ చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. అత్యాచార కేసుల్లో ఏ ఒక్క నిందితుడికి బెయిల్ రాకూడదని, దోషిగా తేలినప్పుడు మరణించే వరకు జైలులోనే ఉండాలని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా గుజరాత్ లో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో నిందితులను క్షమాభిక్ష కింద విడుదల చేయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.