బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌లో కుబేర షూటింగ్‌‌‌‌‌‌‌‌

బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌లో  కుబేర షూటింగ్‌‌‌‌‌‌‌‌

ధనుష్, నాగార్జున లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ధనుష్ పస్ట్‌‌‌‌‌‌‌‌లుక్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ షూటింగ్ పూర్తి కాగా, కొత్త షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌ బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌లో జరుగుతోంది.

నాగార్జునతో పాటు ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. కొన్ని టాకీ సీన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌లు చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌‌‌‌‌‌‌‌లో.. నాగార్జునకు దర్శకుడు శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్ముల సీన్‌‌‌‌‌‌‌‌ గురించి వివరిస్తున్నారు. బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో భారీ అంతస్థుల భవనాలు కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ చూడని అద్భుతమైన లొకేషన్స్‌‌‌‌‌‌‌‌లో షూటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో నాగార్జున బిజినెస్‌‌‌‌‌‌‌‌ మ్యాన్‌‌‌‌‌‌‌‌ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా జిమ్ సర్భ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.