
కూకట్పల్లి, వెలుగు: ఏపీ నుంచి గంజాయి తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న ఒక వ్యక్తిని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో కూకట్పల్లి జూనియర్ కాలేజీ వద్ద గోడెపు రాజు(51) అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇతను గతంలో ఒకసారి గంజాయి విక్రయిస్తూ జీడిమెట్ల పోలీసులకు దొరికితే అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. 8 నెలల జైలు శిక్ష అనంతరం మళ్లీ గంజాయి విక్రయించటానికి ప్రయత్నం చేస్తూ కూకట్పల్లి పోలీసులకు చిక్కాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు.