కోహ్లీ, రోహిత్ కాదు.. 2023లో ఎక్కువ డబ్బు సంపాదించిన ఆటగాళ్లు వీరే

కోహ్లీ, రోహిత్ కాదు.. 2023లో ఎక్కువ డబ్బు సంపాదించిన ఆటగాళ్లు వీరే

భారత క్రికెట్ అనగానే ఎక్కువగా వినపడే పేర్లు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ప్రస్తుత జట్టులో వీరిద్దరే సీనియర్ ఆటగాళ్లు. దేశం తరుపున మ్యాచ్‌లు ఆడుతున్నందుకు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో బీసీసీఐ ఎక్కువ మొత్తం చెల్లిస్తోంది వీరికే..! అయినప్పటికీ వీరిద్దరూ ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో అత్యధిక డబ్బులు ఆర్జించిన భారత ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకోలేకపోయారు. 

ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక డబ్బులు ఆర్జించిన ఆటగాడిగా చైనా మెన్ కుల్దీప్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాదిలో 30 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ రూ. కోటి 80 లక్షల మ్యాచ్ ఫీజు ఆర్జించాడు. ఇక యువ ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ 29 వన్డేలు ఆడటం రూ. 1.74 కోట్లు ఆర్జించి రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ త్రయం మూడో స్థానానికి పరిమితమైంది. 

ఈ ఏడాది వన్డేల ద్వారా అత్యధిక మ్యాచ్ ఫీజు అందుకున్న భారత ఆటగాళ్లు

  • 1. కుల్దీప్ యాదవ్- రూ. 1.8 కోట్లు
  • 2. శుభ్‌మన్ గిల్- రూ. 1.74 కోట్లు
  • 3. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ - రూ. 1.62 కోట్లు
  • 6. రవీంద్ర జడేజా- రూ. 1.56 కోట్లు
  • 7. మహమ్మద్ సిరాజ్- రూ. 1.5 కోట్లు
  • 8. సూర్యకుమార్ యాదవ్- రూ. 1.26 కోట్లు
  • 9. శ్రేయస్ అయ్యర్-రూ. 1.20 కోట్లు
  • 10. హార్దిక్ పాండ్యా-రూ. 1.20 కోట్లు

బీసీసీఐ అధికారిక లెక్కల ప్రకారం.. భారత క్రికెటర్లకు ఒక్క వన్డే ఆడినందుకు రూ. 6 లక్షల మ్యాచ్ ఫీజు చెల్లిస్తారు. వార్షిక కాంట్రాక్ట్‌లో అందే మొత్తానికి ఇది అదనం.