భువనగిరి నుంచి రాహుల్ పోటీ చేస్తే భారీ మెజారిటీ : కుంభం అనిల్ కుమార్

భువనగిరి  నుంచి రాహుల్ పోటీ  చేస్తే భారీ మెజారిటీ : కుంభం అనిల్ కుమార్

భువనగిరి లేదా నల్గొండ ఎంపీగా రాహుల్ గాంధీ పోటీలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోరారని చెప్పారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.  భువనగిరి ఎంపీగా రాహుల్ గాంధీ పోటీ చేస్తే అత్యధిక మెజారిటీతో  గెలిపించుకుంటామన్నారు. భువనగిరి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు.  భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో గృహజ్యోతి , మహాలక్ష్మి గ్యాస్ పథకాలను  ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ ఖమ్మం లేదా భువనగిరి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో కుంభం అనిల్ కుమార్  వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ భువనగిరి, లేదా నల్గొండ ఎంపీగా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.