ఇంటి పన్ను కట్టండి.. లాటరీలో ఫ్రిజ్ తీసుకుపోండి.. కాగజ్ నగర్ మున్సిపాలిటీ బంపర్ ఆఫర్ !

ఇంటి పన్ను కట్టండి.. లాటరీలో ఫ్రిజ్ తీసుకుపోండి.. కాగజ్ నగర్ మున్సిపాలిటీ బంపర్ ఆఫర్ !

కాగజ్‌నగర్‌: కుమ్రంబీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఇంటి పన్ను  వసూలు కోసం మున్సిపాలిటీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంటి పన్ను చెల్లించిన వారికి లాటరీలో మొదటి బహుమతిగా ఫ్రిజ్, రెండో బహుమతిగా మిక్సర్ గ్రైండర్, మూడో బహుమతిగా రైస్ కుక్కర్ను ఇస్తామని మున్సిపల్ కమిషనర్ తిరుపతి ప్రకటించారు. పన్నులు చెల్లించిన వారిని లాటరీలో ఎంపిక చేసి బహుమతులు ఇస్తామని  కమిషనర్ తెలిపారు.

మొండి బకాయిలు చెల్లించే వాళ్లకు ప్రోత్సహమని ఆయన చెప్పారు. మున్సిపాలిటీ ఉద్యోగుల సొంత జీతాల నుంచి ఇస్తామని కమిషనర్ ప్రకటించడం గమనార్హం. పన్ను  చెల్లించిన వారు టోకెన్ను వేయడానికి లాటరీ డబ్బాను అధికారులు ఏర్పాటు చేశారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీ ప్రకటించిన ఈ ఆఫర్ పట్టణ వాసుల్లో అసక్తి రేపింది. ఆస్తి పన్ను చెల్లించడానికి రేపే (మార్చి 31, 2026) చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.

►ALSO READ | గిగ్ వర్కర్లను పట్టించుకోకపోతే అగ్రిగేటర్లకు పెనాల్టీ : మంత్రి వివేక్ వెంకటస్వామి