24 గంటల కరెంటు ఉత్తదే: కుందూరు జయవీర్ రెడ్డి

24 గంటల కరెంటు ఉత్తదే: కుందూరు జయవీర్ రెడ్డి

హాలియా, వెలుగు : రైతులకు ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తామంటున్న బీఆర్ఎస్​ ప్రభుత్వ మాట ఉత్తదేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కుందూరు జయవీర్ రెడ్డి ఆరోపించారు. గురువారం నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం కొప్పోల్ లోని విద్యుత్​ సబ్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. లాగ్ బుక్కులను పరిశీలించారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు త్రీ ఫేస్ కరెంటు సప్లయ్ ​లేకపోవడంతో ఆయన విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALSO READ  : భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కట్టుబడి ఉన్నాం : జస్టిన్ ట్రూడో

నిరంతర విద్యుత్​ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం అబద్దం చెబుతూ రైతుల్ని మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కోతలు లేని కరెంటు ఇవ్వాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కంచర్ల వెంకటేశ్వర్ రెడ్డి, కాటేపల్లి రాధాకృష్ణ, వడ్డెగోని యాదగిరి గౌడ్, మండల అధ్యక్షుడు తగుల్ల సర్వయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీశ్ రెడ్డి, మేడి వెంకన్న, బొమ్ము శ్రీనివాస్, కొత్త నాగరాజు, మారపాక కాషయ్య పాల్గొన్నారు.