కుర్చీ మడతపెట్టి.. మాస్ బీట్తో పూనకాలు తెప్పించిన మహేష్

కుర్చీ మడతపెట్టి.. మాస్ బీట్తో పూనకాలు తెప్పించిన మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ గుంటూరు కారం(Guntur Kaaram). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తరువాత మహేష్ నుండి వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ అండ్ టీజర్ ఆ అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్  కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 

రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమా నుండి తాజాగా కుర్చీ మడతపెట్టి అనే మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో పక్కా మాస్ బీట్ తో నెక్స్ట్ లెవల్లో ఉంది. ఆ మధ్య సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుర్చీ మడతపెట్టి అనే మాటను ఈ పాటకు హుకప్ లైన్ గా తీసుకున్నారు. అది చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ప్రోమోలో మహేష్ అండ్ శ్రీలీల వేసిన మాస్ స్టెప్స్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఇక తమన్ మరోసారి తనలోని మాస్ బీట్స్ కు పనిచెప్పారు. ఇక ఫుల్ సాంగ్ డిసెంబర్ 30న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ సాంగ్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మరి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమాగా వస్తున్న గుంటూరు కారం ఎలాంటి విజయాన్ని అందుకోనుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.