మహేష్ బాబుతో డాన్స్ చేయాలని ఉంది.. కుర్చీ పాటపై తాత రియాక్షన్

మహేష్ బాబుతో డాన్స్ చేయాలని ఉంది.. కుర్చీ పాటపై తాత రియాక్షన్

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సూపర్ హిట్ కాంబోలో వస్తున్న మూడవ సినిమా కావడంతో గుంటూరు కారంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో జనవరి 12న సరికొత్త రికార్డ్స్ క్రియేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనులు మొదలుపెట్టేసిన మేకర్స్.. తాజాగా కుర్చీని మడతపెట్టి అనే ఊర మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట మాస్ ఆసియన్స్ చేత విజిల్స్ వేయిస్తోంది. ఇక సాంగ్ లో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్స్ పీక్స్ లో ఉన్నాయి. అయితే ఈ పాట ఈ రేంజ్ లో హిట్ అవడానికి కారణం కుర్చీని మడతపెట్టి అనే మాటని హుకప్ లైన్ గా వాడటమే. కుర్చీ తాత చెప్పిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన డైలాగ్ ను మహేష్ సినిమాలో పాటగా వాడటంపై కుర్చీ తాత స్పందించారు. 

ఈ పాట గురించి ఆయన మాట్లాడుతూ.. మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమాలో నా డైలాగ్ ను పాటగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ పాటలో మహేష్, శ్రీలీల చేసిన మాస్ డ్యాన్స్ వేరే లెవల్ ఉంది. ఒకవేళ అవకాశం ఇస్తే నాకు ఆ పాటలో డ్యాన్స్ చేయాలని ఉంది.ఇది నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. ఇక నాకు డైలాగ్ ను వాడుకోవడంపై సంగీత దర్శకుడు తమన్ నన్ను పిలిచి నా డైలాగ్ వాడుతున్నామని చెప్పడమే కాక.. ఆర్థిక సాయం కూడా అందించారు.. అంటూ చెప్పుకొచ్చారు కుర్చీ తాత. ప్రస్తుతం కుర్చీ తాత మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.