
కర్నూలు జిల్లా ఉడుములపాడు గ్రామస్థులు ఎన్నికల స్ఫూర్తి చాటుకున్నారు. తాము చైతన్యంలో ముందున్నామని చాటుకున్నారు. ఎన్నికల వేళ అభ్యర్థులు డబ్బులు, మందు పంచి… ఇతర ప్రలోభాలు చూపి ఓట్లు వేయించుకుంటారనేది మన దేశంలో బహిరంగ రహస్యమే. కానీ… ఉడుముల పాడు గ్రామస్తులు మాత్రం ఇలాంటి ఆశలు పెట్టుకుని ఏ అభ్యర్థి తమ ఊరికి రావొద్దని అంటున్నారు.
డబ్బు వద్దు.. అభివృద్ధే ముద్దంటూ గ్రామంలోని యూత్ మెసేజ్ ఇస్తున్నారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలు గ్రామం అంతటా ప్రదర్శించారు. వాడవాడలా బ్యానర్లు పెట్టారు. ప్రచారానికి వచ్చిన నేతలకు తమ గ్రామంలోని సమస్యల గురించి చెబుతున్నారు. డబ్బులు ఎవరికీ ఇవ్వొద్దని… గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఓటు వేస్తామని.. ఇప్పుడు ఓటు వేయించుకుని తర్వాత మాట తప్పితే ఊరంతా ఒక్కటై నిలదీస్తామని హెచ్చరిస్తున్నారు.
డబ్బులకు తీసుకుని ఓటు వేస్తే అప్పుడు నాయకులను ప్రశ్నించే హక్కు ఉండదనీ.. స్వతంత్రంగా ఓటేసినప్పుడే నిలదీసే ధైర్యం వస్తుందని అంటున్నారు ఈ గ్రామయూత్. సూపర్ కదా.