
న్యూఢిల్లీ : దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి తమ నిర్మాణ విభాగం 'మెగా ఆర్డర్'ను పొందినట్లు లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) మంగళవారం తెలిపింది. ఎల్అండ్ కన్స్ట్రక్షన్స్508 కిలోమీటర్ల రూట్ నిర్మించనుంది. హై-స్పీడ్ ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ ముంబై–-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం ఏర్పాటవుతుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత, ఈ ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ వల్ల రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కు జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ నిధులు సమకూరుస్తోందని కంపెనీ తెలిపింది.