ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ లాభం రూ.3,987 కోట్లు

ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ లాభం రూ.3,987 కోట్లు

న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ4) లో రూ.3,987 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌)  సాధించింది. కానీ, ఇది ఎనలిస్టులు అంచనావేసిన రూ.4,399 కోట్లు కంటే తక్కువ. కార్యకలాపాల ద్వారా సంపాదించిన రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 10.4 శాతం పెరిగి రూ.58,335.15 కోట్లకు ఎగిసింది. షేరుకి రూ.24 ఫైనల్ డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.

2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఎల్ అండ్ టీ రెవెన్యూ రూ.1.83 లక్షల కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ. నికర లాభం 21 శాతం పెరిగి రూ.10,471 కోట్లకు పెరిగింది.  క్యూ4 లో కంపెనీకి రూ.6,833 కోట్ల ఇబిటా వచ్చింది.  ఆర్డర్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో  ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడాది ప్రాతిపదికన 3 శాతం పెరిగి రూ.76,099 కోట్లకు ఎగిసింది. ఇందులో  ఇంటర్నేషనల్ ఆర్డర్లు రూ.36,046 కోట్లు ఉన్నాయి. క్యూ4 లో వచ్చిన మొత్తం ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లోలో దీని వాటా 47 శాతం. 2022–23 లో మొత్తం రూ.2.30 లక్షల కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి.