ఎల్ అండ్ టీ ఫైనాన్స్ లాభం రూ. 735 కోట్లు

ఎల్ అండ్ టీ ఫైనాన్స్ లాభం రూ. 735 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: ఎల్ అండ్ టీ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్​టీఎఫ్)కు ఈ ఏడాది సెప్టెంబర్​తో ముగిసిన రెండో క్వార్టర్​లోరూ. 735 కోట్ల  నికర లాభం (పీఏటీ) వచ్చింది. గత ఏడాది రెండో క్వార్టర్​తో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. కంపెనీ రిటైల్ బుక్ సైజ్ విలువ రూ. 1,04,607 కోట్లకు చేరింది. ఏడాది లెక్కన 18 శాతం వృద్ధిని నమోదు చేసింది.

రెండో క్వార్టర్​లో రిటైల్ డిస్ట్రిబ్యూషన్ల విలువ రూ. 18,883 కోట్లుగా నమోదయింది. ఏడాది లెక్కన 25 శాతం పెరిగింది. రిటైలైజేషన్ 98 శాతంగా ఉంది. కస్టమర్- ఫేసింగ్ డిజిటల్ చానెల్ ‘ప్లానెట్’ యాప్​ను రెండు కోట్ల మందికి పైగా డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకున్నారు. రేటింగ్​ఏజెన్సీ ఎస్ అండ్ పీ కంపెనీ అంతర్జాతీయ ఇష్యూయర్ లాంగ్-టర్మ్ క్రెడిట్ రేటింగ్‌‌‌‌లను "బీబీబీ/స్టేబుల్​"కి అప్‌‌‌‌గ్రేడ్ చేసింది. 

దీనివల్ల కంపెనీ ప్రపంచ పెట్టుబడి మార్కెట్‌‌‌‌లను ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుందని ఎల్​టీఎఫ్​ ఎండీ,  సీఈఓ సుదీప్త రాయ్ అన్నారు. గోల్డ్ లోన్స్ విభాగంలో దూకుడుగా విస్తరిస్తామని తెలిపారు.