ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌ నుంచి మరో సాంగ్

ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌ నుంచి మరో సాంగ్

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రూపొందిన  చిత్రం ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’.  నటుడు రాహుల్‌‌ రవీంద్రన్‌‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.  అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.  ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌‌‌‌తో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌‌ను రిలీజ్ చేశారు.   

‘కురిసే వాన..’ అంటూ సాగే మెలోడీని హేషమ్ అబ్దుల్ వహబ్ కంపోజ్ చేయగా, రాకేందు మౌళి రాసిన లిరిక్స్, కపిల్  కపిలన్ పాడిన తీరు ఇంప్రెస్ చేశాయి.  ‘కురిసే వాన తడిపేయాలన్న భూమే ఏదో ,  సరదా పడుతూ పురి విప్పేస్తున్న నెమలే ఏదో,  ఓ నీలి మేఘం పెంచింది వేగం, ఆ జాబిలమ్మ చెంత చేరి వంతపాడి, కమ్మితే మైకం, లాయి లాయి లాయిలే..’  అంటూ సాగిన పాటలో రష్మిక, దీక్షిత్ జోడీ ఆకట్టుకుంది. కాలేజ్ స్టూడెంట్స్‌‌గా కనిపిస్తున్న వీరిద్దరి  ప్రేమను  ఈ పాట ద్వారా చూపించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచింది.  నవంబర్ 7న వరల్డ్‌‌వైడ్‌‌గా ఐదు భాషల్లో సినిమా విడుదలవుతోంది.