నాట్లేసేందుకు.. మగవారే కావాలి : ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు

నాట్లేసేందుకు.. మగవారే కావాలి : ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు

సుల్తానాబాద్, వెలుగు: సహజంగా మహిళలు నాట్లు వేయడం ఎప్పటినుంచో చూస్తున్నాం..కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్ నుంచి వస్తున్న కూలీలు పెద్దపల్లి జిల్లాలో ఎక్కడ చూసినా   పొలాల్లో వరి నాట్లు వేస్తూ కనిపిస్తున్నారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున తీసుకుంటూ 15 మంది బృందంగా పని చేస్తూ రోజూ 5 ఎకరాల్లో నాట్లు వేస్తున్నారు. 

ఇలా ఇప్పటికే దాదాపు 3 వేల మంది ఇతర రాష్ట్రాల కూలీలు జిల్లాకు చేరుకున్నట్టు సమాచారం. స్థానికంగా కూలీల కొరత ఉండడంతో పాటు అక్కడి కూలీలు వేగంగా వరినాట్లు వేస్తుండడంతో వారి వైపు మొగ్గు చూపుతున్నామని రైతులు తెలిపారు.