
- ప్రభుత్వ స్కీంలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేయాలని కార్యకర్తలకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. బుధవారం షేక్‌పేట్‌లో జరిగిన బూత్‌స్థాయి కమిటీ సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. షేక్ పేట్ డివిజన్ లోని 55 బూత్ కమిటీ సభ్యులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ ఒక్క డివిజన్ నుంచే పార్టీకి 30 వేల మెజార్టీ వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇక్కడి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకునేందుకు ఉప ఎన్నిక తోడ్పడుతుందన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరలో ప్రారంభిస్తామని, కొత్త పనులకు శంకుస్థాపనలు కూడా పెట్టుకుందామన్నారు. ఆయా పనులకు శంకుస్థాపనలను ప్రజల చేతుల మీదుగానే నిర్వహించి, ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచాలన్నారు. స్థానిక నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నేత అజారుద్దీన్, ఇతర లీడర్లు పాల్గొన్నారు.