ఎల్ఏసీ దగ్గర బలగాలను వెనక్కి పంపిస్తున్న చైనా

ఎల్ఏసీ దగ్గర బలగాలను వెనక్కి పంపిస్తున్న చైనా

ఈ నెల 6 న తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తున్నామన్న విదేశాంగ శాఖ

బీజింగ్ : ఇండియా – చైనా బార్డర్ లైన్ ఆఫ్ యాక్చవల్ కంట్రోల్ (ఎల్ఏసీ) దగ్గర మామూలు పరిస్థితులు నెలకొనేందుకు రెండు దేశాలు చర్యలు ప్రారంభించాయని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నెల 6 న రెండు దేశాల కు చెందిన కమాండర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయటం మొదలైందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చునింగ్ బుధవారం చెప్పారు. సానుకూలంగా ఏకాభిప్రాయం ద్వారా సమస్య ను పరిష్కరించుకోవాలని ఈ సమావేశంలో రెండు దేశాలు నిర్ణయించారు. సమావేశంలో భాగంగా తూర్పు లడఖ్‌లోని మూడు ప్రాంతాల(గాల్వన్‌ లోయ- పెట్రోలింగ్‌ పాయింట్‌ 14, పెట్రోలింగ్‌ పాయింట్‌ 15, హాట్‌ స్ప్రింగ్స్‌- పెట్రోలింగ్‌ పాయింట్‌ 17) నుంచి రెండు దేశాలు బలగాలను వెనక్కి పంపించేందుకు అంగీకరించాయి. పాంగోంగ్‌ త్సో ప్రాంతంలోని ఫింగర్స్‌ రీజియన్, దౌలత్‌ బేగ్‌ ఓల్డీ మినహా మిగతా చోట్ల డ్రాగన్‌ బలగాలు 2 నుంచి రెండున్నర కిలోమీటర్ల మేర వెనక్కి పంపించాయి. ఇక్కడ బలగాలను వెనక్కి పంపించాలని మనదేశం కోరిన మరుసటి రోజే చైనా బలగాలను వెనక్కి పంపింది. మనదేశం కూడా దశల వారీగా సైన్యాన్ని వెనక్కి పిలువనుంది. వీలైనంత త్వరగా ఎల్ఏసీ దగ్గర సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ చర్చలు జరిగే నాటికే వివాదాన్ని ముగించేందుకు రెండు దేశాలు సానుకూలంగా ఉన్నాయని ప్రకటించింది.

LAC row | Beijing says China and India taking steps to ‘ease’ situation along border