
హైదరాబాద్ బస్ భవన్ దగ్గర ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఇందులో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి బీజేపీతో పాటు పలువురు పార్టీ నేతలు మద్దతు తెపడంతో పాటు ఆందోళనలో పాల్గొన్నారు.
ఆందోళనలో పాల్గొన్న ఓ మహిళా కండక్టర్ తన ఆవేదనను వ్యక్తం చేయడంతో పాటు..సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రూ.50 వేల రూపాయల జీతం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీనియర్ ఉద్యోగినైన తనకే 14 వేల రూపాయల సాలరీ మాత్రమే వస్తోందని చెప్పారు. కుటుంబ సభ్యులు అడిగితే మీరు చెప్పినట్లుగా మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు రావాలని ప్రశ్నించారు. తాను 50 వేల రూపాయల జీతం తీసుకుంటున్నట్లు నిరూపిస్తే సమ్మె వదిలేసి విధుల్లో చేరుతానన్న ఆమె… లేదంటే మీరు పదవికి రాజీనామా చేస్తారా అని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.