లఖీంపూర్ ఘటనపై సుప్రీం సీరియస్

లఖీంపూర్ ఘటనపై సుప్రీం సీరియస్

ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఘటన కేసు సుప్రీంకోర్టులో నేడు విచారణకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారని సీజే ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం ప్రశ్నించింది. కాగా.. ఘటనకు సంబంధించిన దర్యాప్తును సీల్డు కవర్‎లో ఈ రోజు కోర్టుకు సమర్పించినట్లు హరీష్ సాల్వే తెలిపారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ సూర్యకాంత్.. తాము నివేదికను సీల్డు కవర్‎లో ఇవ్వమని చెప్పలేదని తెలిపింది. అయినా తమ ధర్మాసనం మంగళవారం రాత్రి 1 గంట వరకు వేచి చూశామని.. మాకు ఎటువంటి నివేదిక అందలేదని జస్టిస్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు గంటముందు నివేదిక ఇస్తే ఎలా చదువుతారని ప్రశ్నించారు. ఘటన జరిగి ఇన్ని రోజులవుతుంటే.. ఎంతమందిని అరెస్ట్ చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. కేసుకు సంబంధించి 164 మంది సాక్షులుంటే.. ఇప్పటివరకు కేవలం 44 మందిని మాత్రమే ప్రశ్నించడం ఏంటని అడిగింది. గత విచారణలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. తాజాగా హరీష్ సాల్వే వాదనపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే గురువారం లేదా శుక్రవారానికి వాయిదావేయాలని హరీష్ సాల్వే కోరగా.. అక్టోబర్ 26 బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

For More News..

త్వరలో ఫేస్‎బుక్ పేరు మార్పు!

మరో 5 రోజుల్లో ఇంటర్ పరీక్షలు.. హాల్‎టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదు