ఆటోను ఢీ కొట్టిన ట్రక్కు..9 మంది మృతి

ఆటోను ఢీ కొట్టిన ట్రక్కు..9 మంది మృతి

బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్రక్కు ఢీ కొట్టింది.ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఐదు మందికి  గాయాలయ్యాయి. లఖిసరాయ్ టౌన్ దగ్గర ఝల్నా విలేజ్  దగ్గర అర్థరాత్రి ఈ ఘటన జరిగింది.

ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.   గాయపడిన ఐదుగురిని  పోలీసులు ఆస్పత్రికి తరలించారు.వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు పోలీసులు.  ప్రమాదానికి కారణం అతి వేగమేనని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.