లాజిస్టిక్స్ బిజినెస్‭లోకి లక్ష్మీ నివాసం

లాజిస్టిక్స్ బిజినెస్‭లోకి లక్ష్మీ నివాసం

హైదరాబాద్, వెలుగు: సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీ లక్ష్మీ నివాసం లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది. సబ్సిడరీ లక్ష్మీ లాజిస్టిక్స్ ద్వారా దేశంలో లాజిస్టిక్స్ పార్క్ లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. మొదటి దశలో చిత్తూరు (ఏపీ), సదాశివపేట్ (తెలంగాణ), లక్నో ( యూపీ) లలో లాజిస్టిక్స్ పార్క్ లను నిర్మిస్తామని, ఇందుకోసం రూ. 150 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని వివరించింది. ఈ సిటీల్లో మొత్తం 30 ఎకరాల్లో 6.75 లక్షల చదరపు అడుగుల వేర్ హౌసింగ్ స్పేస్ ను అందుబాటులోకి తీసుకొస్తామంది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, పీ అండ్ జీ వంటి పెద్ద కంపెనీలకు ఈ వేర్ హౌస్ లు సర్వీస్ అందిస్తాయని లక్ష్మీ నివాసం చైర్మన్ సముద్రపల్లి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

అంతేకాకుండా సాధారణ ప్రజలు సైతం తమ లాజిస్టిక్స్ పార్క్ లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించొచ్చని అన్నారు. తమ లాజిస్టిక్స్ పార్క్ లలో 40 గజాలు రూ. 5.24 లక్షలకే అందుబాటులో ఉన్నాయని, ఇన్వెస్టర్లు తమ స్థలాన్ని రెంట్ కి ఇవ్వడం ద్వారా రెంటల్ ఇన్ కమ్ పొందొచ్చని వివరించారు. ఏడాదికి 8–-12 శాతం రిటర్న్ పొందొచ్చని, దీంతో పాటు ప్రతీ ఏడాది అదనంగా 5% రెంటల్ ఇన్ కమ్ పెరుగుతుందని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.