అడవిలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

అడవిలో  ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

కడెం, వెలుగు: కడెం మండలం దిల్దార్ నగర్ గ్రామ సమీపంలోని గోదావరి నది తీరాన దట్టమైన అడవిలో కొండపై వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం బుధవారం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారి కల్యాణం వీక్షించారు.ఈ సందర్భంగా భక్తులకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు మహా రాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన జాతర రథోత్సవం ఈనెల 24న నిర్వహిస్తారు. 25న ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి.