సేన్‌.. అదిరెన్‌

సేన్‌.. అదిరెన్‌
  • ఆల్‌‌‌‌ ఇంగ్లండ్‌‌ ఫైనల్లో లక్ష్య
  • మెన్స్‌‌లో ఈ ఘనత సాధించిన నాలుగో ఇండియన్‌‌ షట్లర్‌‌

బర్మింగ్‌‌‌‌హామ్‌‌: ఇండియా యంగ్‌‌ షట్లర్‌‌ లక్ష్యసేన్‌‌.. ఆల్‌‌ ఇంగ్లండ్‌‌ బ్యాడ్మింటన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో సంచలనం సృష్టించాడు. శనివారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ సెమీఫైనల్లో లక్ష్య 21–13, 12–21, 21–19తో  డిఫెడింగ్‌‌ చాంపియన్‌‌ లీ జీ జియా (మలేసియా)కు షాకిస్తూ.. ఫైనల్లోకి దూసుకెళ్లాడు. దీంతో ఈ కేటగిరీలో టైటిల్‌‌ ఫైట్‌‌కు అర్హత సాధించిన నాలుగో ఇండియన్‌‌ షట్లర్‌‌గా రికార్డులకెక్కాడు. ప్రకాశ్‌‌ నాథు (1947), ప్రకాశ్‌‌ పదుకొనే (1980), పుల్లెల గోపీచంద్‌‌ (2001) ఈ జాబితాలో ముందున్నారు. అయితే  ప్రకాశ్‌‌, గోపీ టైటిల్స్‌‌ను సాధించగా, నాథు, సైనా (2015) రన్నరప్‌‌తో సరిపెట్టుకున్నారు. గంటా 16 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌‌లో ప్రతి పాయింట్‌‌ కోసం ఇద్దరు షట్లర్లు హోరాహోరీగా తలపడ్డారు. 

ఓపెనింగ్‌‌ గేమ్‌‌లో లక్ష్య డిఫెన్సివ్‌‌ స్కిల్‌‌తో పోరాడాడు. కోర్టులో చురుకుగా కదులుతూ 11–7తో లీడ్‌‌ సాధించాడు. ఈ దశలో లీ తన ట్రేడ్‌‌ మార్క్‌‌ షాట్లతో ఆధిక్యాన్ని 10–12కు తగ్గించాడు. కానీ లక్ష్య లాంగ్‌‌ ర్యాలీస్​తో లీని కట్టిపడేశాడు. అయితే రెండో గేమ్‌‌లో లీ 9–2తో ముందంజ వేశాడు. మిక్స్‌‌డ్‌‌ షాట్స్‌‌తో అదే జోరును కంటిన్యూ చేసి స్కోరును 1–1తో సమం చేసి మ్యాచ్‌‌లో నిలిచాడు. డిసైడర్‌‌లో సేన్‌‌ 3–1 ఆధిక్యంలోకి వెళ్లినా.. లీ బ్యాక్‌‌ హ్యాండ్‌‌ క్రాస్‌‌ కోర్టు షాట్లతో స్కోరు ఈక్వల్‌‌ చేశాడు. ఈ క్రమంలో 67 షాట్ల ర్యాలీని కూడా లీ సొంతం చేసుకున్నాడు. మిడ్‌‌ గేమ్‌‌లో లక్ష్య వెనుకబడటంతో లీ 14–10 ఆధిక్యంలో నిలిచాడు. కానీ పట్టు వదలకుండా పోరాడిన లక్ష్య వరుసగా పాయింట్లు నెగ్గి లీడ్‌‌ను 16–17కు తగ్గించి 18–18 సమం చేశాడు. ఈ దశలో మూడు బలమైన క్రాస్‌‌ కోర్టు విన్నర్లతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.