మీర్పూర్: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న న్యూజిలాండ్.. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో బోణీ చేసింది. హెన్రీ నికోల్స్ (68), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (59) హాఫ్ సెంచరీలకు తోడు బౌలింగ్‌లో బ్లెయిర్ టిక్నర్ (4/40), నేథన్ స్మిత్ (3/45) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 26 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది.
టాస్ గెలిచిన కివీస్ 50 ఓవర్లలో 247/8 స్కోరు చేసింది. విల్ యంగ్ (30), నేథన్ స్మిత్ (21) ఫర్వాలేదనిపించారు. తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, రషీద్ హుస్సేన్ తలా రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో కివీస్ 48.3 ఓవర్లలో 221 రన్స్‌కు ఆలౌటైంది. సైఫ్ హసన్ (57), తౌహిద్ (55), లిటన్ (46) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. ఫాక్స్‌క్రాఫ్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో వన్డే సోమవారం ఇదే వేదికపై జరుగుతుంది.

