కుమమోటో (జపాన్): ఇండియా షట్లర్ లక్ష్యసేన్.. మాస్టర్స్ జపాన్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో సెమీస్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో వరల్డ్ 13వ ర్యాంకర్ లక్ష్య 21–16, 21–15తో యుషి తనకా (జపాన్)పై గెలిచాడు. 40 నిమిషాల మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్ రెండు గేముల్లోనూ ఆధిపత్యం చూపెట్టాడు.
సెమీస్లో లక్ష్య.. ఎనిమిదో సీడ్ అల్వి పర్హాన్ (ఇండోనేసియా)తో తలపడనున్నాడు. మరో క్వార్టర్స్ మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ 22–24, 15–21తో కొకి వతనాబే (జపాన్) చేతిలో కంగుతిన్నాడు.
