లాల్ దర్వాజలో భవిష్యవాణి : వానలు, కాలాలు సక్కగనే ఉన్నయ్..

లాల్ దర్వాజలో భవిష్యవాణి : వానలు, కాలాలు సక్కగనే ఉన్నయ్..
  • దుర్భుద్ది ,దురాలోచన, పాపాల వల్లే ఇదంతా..
  • లాల్​ దర్వాజలో భవిష్యవాణిలో మాతంగి అనురాధ

హైదరాబాద్ సిటీ/మెహిదీపట్నం/పద్మారావునగర్, వెలుగు: పాతబస్తీలోని లాల్​దర్వాజ సింహవాహిని ఆలయంలో మాతంగి అనురాధ సోమవారం భవిష్య వాణి వినిపించారు. భక్తులు అడిగిన  ప్రశ్శలకు జవాబులిచ్చారు. చాలా ఏండ్ల నుంచి లాల్​దర్వాజ ఆలయ విస్తరణ గురించి ప్రశ్నించగా.. ‘ నేను ఉన్న దగ్గరే ఉంటా. నన్ను మాత్రం ఎక్కడా కలపకూడదు. మీకు నచ్చిన విధంగా, మీ ఆలోచనకు వచ్చిన విధంగా.. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా సంబురాలు చేసుకోండి. మీకు తోడు నీడగా ఉంటా’ అని సమాధానం ఇచ్చారు. వర్షాలు సరిగ్గా కురవాలని కోరగా.. ‘వర్షాల, కాలాలు అన్నీ సరిగ్గా ఉన్నాయి. కానీ, మీ దుర్భుద్ది , దురాలోచన, పాపాల వల్ల ఇదంతా జరుగుతోంది’ అని అన్నారు. 

అలాగే మీర్​ఆలం మండీలో మాతంగి స్వర్ణలత, కార్వాన్​లో దర్బార్ మైసమ్మ ఆలయంలో సుశీలమ్మ, సికింద్రాబాద్​ చిలకలగూడ కట్టమైసమ్మ నల్లపోచమ్మ గుడిలో లక్ష్మమ్మ భవిష్యవాణి వినిపించారు. ఐదు నుంచి తొమ్మిది వారాల పాటు  సాక పొస్తే కష్టాలు లేకుండా బిడ్డలను కడుపులో పెట్టి చూసుకుంటానని చెప్పారు. లాల్​దర్వాజ సింహవాహిని అమ్మవారి దర్శనం కోసం సోమవారం సుమారు 8 నుంచి 10 లక్షల మంది భక్తులు  పాల్గొనగా.. రెండురోజుల్లో సుమారు 15 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కమిటీ సభ్యులు అంచనా వేశారు.