లాలాగూడ ఇన్ స్పెక్టర్ పద్మ సస్పెన్షన్

లాలాగూడ ఇన్ స్పెక్టర్ పద్మ సస్పెన్షన్

సికింద్రాబాద్, వెలుగు : యాక్సిడెంట్ కేసులో నిర్లక్ష్యం చేసి, తప్పుగా నమోదు చేసినందుకు లాలాగూడ ఇన్ స్పెక్టర్ పల్లె పద్మ  సస్పెండ్ అయ్యారు. 3 రోజుల కిందట ఆమెపై బదిలీ వేటు పడగా మంగళవారం పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓ యాక్సిడెంట్ కేసులో ఇన్ స్పెక్టర్ పద్మ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ లభించినా కూడా నిందితుడైన వ్యక్తిపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయకుండా కేసును తప్పుడుగా నమోదు చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికెళ్లడంతో ఆమెపై సీరియస్ అయ్యారు. శనివారం సీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. 3 రోజులు విచారించిన అనంతరం ఆమెను సస్పెండ్ చేశారు.