నందిని హీరోయిన్ గా.. జొన్నవిత్తుల దర్శకత్వంలో లలిత మూవీ 

నందిని హీరోయిన్ గా.. జొన్నవిత్తుల దర్శకత్వంలో లలిత మూవీ 

లిరిసిస్ట్‌‌‌‌గా పదునైన పదాలతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న  జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు  దర్శకుడిగా కూడా మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆయన రూపొందిస్తున్న చిత్రానికి  ‘లలిత’ అనే టైటిల్‌‌‌‌ను ప్రకటించారు.  కాస్మిక్ పవర్ క్రియేట్స్ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌పీ  బ్యానర్‌‌‌‌పై  పి. సుధీర్ రాజు, డి. వైష్ణవి నేహా ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.   

నందిని హీరోయిన్‌‌‌‌గా, అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలుగా పరిచయమవుతున్నారు.  రఘు బాబు, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తన విశ్వాసం, వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథగా రూపొందుతున్న ఈ సామాజిక నేపథ్య చిత్రానికి 'గర్ల్‌‌‌‌ఫ్రెండ్ అంటే బానిస కాదు...' అనే క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది.  త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తామన్నారు మేకర్స్.  మణి, నాగరాజు సంగీతం అందిస్తున్నారు.