క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం

క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం

రాంచీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. రిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్కు తరలించనున్నట్లు సమాచారం. లాలూ గుండెతో పాటు కిడ్నీలో సమస్య తలెత్తినట్లు గుర్తించిన డాక్టర్లు.. ఎయిమ్స్కు తరలిస్తే మెరుగైన వైద్యం అందించవచ్చని భావిస్తున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన రిమ్స్ బోర్డు సభ్యులు ఆయనను వెంటనే ఎయిమ్స్ కు తరలించాలని సూచించారు. డాక్టర్ల నివేదిక ఆధారంగా జైలు అధికారులు ఆయనను ఎప్పుడు ఢిల్లీకి తరలించాలన్నది నిర్ణయించనున్నారు. ఇదిలా ఉంటే ఈ రాత్రికే లాలూను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీ ఎయిమ్స్కు తరలించనున్నట్లు  సమాచారం.

దాణా కుంభకోణంలో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను రాంచీలోని రిమ్స్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇవాళ ఉదయం లాలూ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు ఎయిమ్స్కు తరలించాలని సూచించారు.

For more news..

ఏప్రిల్ 3న భారత్ కు ఇజ్రాయెల్ ప్రధాని

ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్