శ్రీవారి సేవలో లాలూ.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం

శ్రీవారి సేవలో లాలూ.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ శనివారం (డిసెంబర్ 9న) తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుమలకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న ఆయన శనివారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. లాలు ప్రసాద్‌ యాదవ్‌ వెంట ఆయన భార్య రబ్రిదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌, కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనంలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.