
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మెరుగుపడినట్లుగా ఆయన పెద్ద కుమార్తె, రాజ్యసభ ఎంపీ మిసా భారతి తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా లాలూ ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని ఆమె చెప్పారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. అటు లాలూ కూమారుడు తేజస్వి యాదవ్ కూడా తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్లుగా తెలిపారు. కేవలం పడుకున్నప్పుడు మాత్రమే డాక్టర్లు ఆక్సిజన్ సపోర్టు ఇస్తున్నారని తేజస్వి చెప్పారు. త్వరలోనే ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించే అవకాశం ఉందన్నారు.
గత ఆదివారం లాలూ తన నివాసంలోని మెట్లపై నుంచి జారిపడ్డారు. దీనితో ఆయన కుడి భుజానికి గాయలయ్యాయి. వెంటనే ఆయనను పాట్నాలోని పరాస్ ఆసుపత్రికి తరలించారు. ఆనంతరం అక్కడినుండి అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. లాలూ కిడ్నీ, గుండె, రక్తపోటు, మధుమేహం సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు.
अपने मनोबल और आप सब की दुआओं की बदौलत लालू जी की स्थिति अब काफी बेहतर है। कृपया अफवाहों पर ध्यान ना दें। साथ बनाए रखें, दुआओं में @laluprasadrjd जी को याद रखें।
— Dr. Misa Bharti (@MisaBharti) July 8, 2022
धन्यवाद।
तस्वीरें आज सुबह की: pic.twitter.com/RvcEbqcJRB