లంబాడాల జనాభాను బహిర్గతం చేయాలి : దాస్ రాంనాయక్

లంబాడాల జనాభాను బహిర్గతం చేయాలి : దాస్ రాంనాయక్

జైపూర్(భీమారం), వెలుగు: కులగణనలో లంబాడాల జనాభాను బహిర్గతం చేయాలని లంబాడీ హక్కుల  జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు దాస్ రాంనాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ నాయక్ డిమాండ్​చేశారు. లంబాడీ హక్కుల పోరాట సమితి నంగార భేరి భూక్య రాజ్ కుమార్ నాయక్ అధ్యక్షతన భీమారం మండల కేంద్రంలో  గురువారం సమావేశం నిర్వహించారు. పాల్గొన్న దాస్​రాంనాయక్, రాజేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలన్నారు.

ఎస్టీల గ్రామపంచాయితీల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి, పెండింగ్ లో ఉన్న ట్రైకార్ రుణాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని  సాధారణ సెలవుదినంగా ప్రకటించాలన్నారు. సమావేశంలో జిల్లా లైవ్ అధ్యక్షుడు సమ్మయ్య, ఎల్ హెచ్ పీఎస్ నాయకులు అమర్ సింగ్, శంకర్, శ్రీనివాస్, దేవ్ నాయక్, రవి నాయక్, రాజేశ్ పాల్గొన్నారు.