ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ఊసెత్తని కేసీఆర్

ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ఊసెత్తని కేసీఆర్

హైదరాబాద్: లంబాడీలను సీఎం కేసీఆర్ మోసం చేశారని లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్ మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోశాధికారిగా భూక్యా శోభన్ బాబు నాయక్ ను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి లోని వేదిక కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ... తాము అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటినా... ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కనీసం ప్రస్తావించడంలేదని ఫైర్ అయ్యారు. ప్రత్యేక ఎస్టీ కమిషన్, ట్రైబల్ యూనివర్సిటీలకు సంబంధించి ఊసెత్తడంలేదని తెలిపారు. లంబాడీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న రాజకీయ పార్టీలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. లంబాడీల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే వాళ్లకే తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

మనాలీలో అఖిల్ భయపెట్టించే యాక్షన్ సీన్స్

స్పైస్ జెట్ పై సైబర్ దాడి.. ప్రయాణికుల అవస్థలు