మంత్రులకు ల్యాండ్​ క్రూజర్లు

మంత్రులకు ల్యాండ్​ క్రూజర్లు
  •      బీఆర్ఎస్ సర్కారు​ హయాంలో విజయవాడలో ఉంచిన వెహికల్స్​ను మినిస్టర్లకు ఇచ్చిన ప్రభుత్వం

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినేట్​లోని మంత్రులంద‌‌‌‌‌‌‌‌రికీ సర్కారు కొత్త ల్యాండ్ క్రూజ‌‌‌‌‌‌‌‌ర్ కార్లను కేటాయించింది. ఈ వెహికల్స్​కు ఆయా మంత్రులు పూజ‌‌‌‌‌‌‌‌లు కూడా నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్క వాహనానికి రూ. మూడు కోట్లు చెల్లించి..  22  ల్యాండ్​ క్రూజర్లను కొనుగోలు చేసింది. వాటిని చాలా కాలం పాటు విజయవాడలోనే ఉంచింది. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అనుకున్న బీఆర్ఎస్​ వీటికి బుల్లెట్ ప్రూఫ్ జోడించింది. 

ఇందుకోసం ఏడాది  సమయం తీసుకున్నది.  మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వెహికల్స్​ను వాడాలని నిర్ణయించుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ వాహనాలను హైదరాబాద్ కు రప్పించారు. సీఎం రేవంత్​రెడ్డి తన కాన్వాయ్​లో వాహనాలను తగ్గించడంతో పాటు పాత ల్యాండ్​ క్రూజర్లకే రంగులు వేయించి వాడుకుంటున్నారు.  అసెంబ్లీ స్పీకర్​, శాసనమండలి చైర్మన్, డిప్యూటీ సీఎంలకు అప్పుడే ఈ ల్యాండ్​ క్రూజర్లను కేటాయించారు. మిగిలిన వాటిని ఇప్పుడు మంత్రులందరికీ ఇచ్చారు.