ధరణిలో దందాలు.. ప్లాట్లన్నీ అమ్మేశాక రోడ్లు మరొకరికి రిజిస్ట్రేషన్

ధరణిలో దందాలు.. ప్లాట్లన్నీ అమ్మేశాక రోడ్లు మరొకరికి రిజిస్ట్రేషన్

రాష్ట్రంలో ఆరేండ్ల కింద జరిగిన భూరికార్డుల ప్రక్షాళనలో కొందరు రెవెన్యూ ఆఫీసర్లు చాలా చోట్ల రోడ్లకు కూడా పట్టా చేసి పాస్ బుక్స్ జారీ చేశారు. భూ రికార్డుల్లో రోడ్లను కూడా వ్యవసాయ భూములుగా నమోదు చేశారు. ఇలాంటి వాటిలో గ్రామాల మధ్య ఉండే పంచాయతీ రాజ్ రోడ్లతో పాటు ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్ కు చెందిన భూములు కూడా ఉన్నాయి. 

ఉదాహరణకు ఎవరైనా ఒక ఎకరం (40 గుంటల్లో)లో రెండు గుంటలకో ప్లాట్ చొప్పున 13 ప్లాట్లుగా (26 గుంటలు) చేసి, మరో 14 గుంటల భూమిని రోడ్లకు వదిలారనుకుందాం. ఇలా 26 గుంటల భూమిని 13 మందికి రిజిస్ట్రేషన్ చేశాక.. రోడ్ల కింద తీసిన మిగతా 14 గుంటల భూమి సదరు పట్టాదారు పేరిటే ధరణిలో చూపిస్తుంది. ఇలా రోడ్ల కింద తీసిన భూమిని కూడా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. లే అవుట్ ప్లాట్ల విషయంలోనూ ఇలాంటి మోసాలే జరుగుతున్నాయి. మొదట్లో వెంచర్​కు రెండు, మూడు రోడ్లు చూపే రియల్టర్లు, అసలు ప్లాట్లన్నీ అమ్ముకున్నాక ఒకటి, రెండు రోడ్లను క్లోజ్​చేసి చిన్నచిన్న  ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు. ఇలా రోడ్లను కూడా రిజిస్ట్రేషన్ చేయడంతో అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లంతా ఎవరికి చెప్పుకోవాలో తెలియక పరేషాన్ అవుతున్నారు.