రాజేంద్రనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత..సాఫ్ట్వేర్స్ అరెస్ట్

రాజేంద్రనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత..సాఫ్ట్వేర్స్ అరెస్ట్

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. శివరాంపల్లిలోని పిల్లర్ నెం. 290 సమీపంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు  పోలీసులు . ఆమెతో పాటు మరో ఇద్దరు యువకులు అర్జున్, డేవిడ్ ను  కూడా అదుపులోకి తీసుకున్నారు.

శివరాంపల్లి లోని పిల్లర్ నెం. 290 వద్ద ఉన్న ప్రావిడెంట్ కేన్వర్ట్ అపార్ట్ మెంట్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సంధ్య ( 26) డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా రూ. 2 లక్షల విలువ చేసే 7.5 గ్రాముల  డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

పక్కా  సమాచారంతో బాలానగర్ ఎస్ వోటీ పోలీసులు, రాజేంద్ర నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని కోర్టులో హాజరు పర్చారు. అయితే ఈ డ్రగ్స్ సరఫరా వెనక ఎవరున్నారు.. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.