లాస్ట్ ఛాన్స్ : మరికొన్ని గంటల్లో చచ్చిపోతున్న 2 వేల నోటు

లాస్ట్ ఛాన్స్ : మరికొన్ని గంటల్లో చచ్చిపోతున్న 2 వేల నోటు

రెండు వేల నోటును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ 30తో  ఆర్బీఐ ఇచ్చిన గడువు ముగియబోతోంది.  డెడ్ లైన్ ముగియనుండటంతో ఆర్బీఐ మరోసారి గడువు పెంచుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 

2019లోనే రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపి వేసిన ఆర్బీఐ ..నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు మే 19, 2023 న  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2వేల నోట్లను మార్చుకునేందుకు లేదా బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు 4 నెలల సమయం(సెప్టెంబర్ 30)  ఇచ్చింది.  దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పించింది.

 సెప్టెంబర్ 1 నాటికి  దాదాపు 93 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది.   ఇప్పటికీ దాదాపు రూ. 24 వేల 87 కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది.