గురుకుల దరఖాస్తులకు ఈనెల 10 చివరి తేదీ

గురుకుల దరఖాస్తులకు ఈనెల 10 చివరి తేదీ

కేజీ టు పీజీ విద్యావిధానం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యాశాఖ, SC,ST,BC సంక్షేమశాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 2019-20 విద్యాసంవత్సరానికి గాను ఐదోతరగతి ప్రవేశానికి ఈ నెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. గురుకుల విద్యార్థులకు అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో బోధన ఉంటుంది. గురుకులంలో చేరిన రోజు నుంచి 24 గంటల పాటు ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటుంది. ఐఐటీ, ఎంసెట్, నీట్ వంటి అనేక పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ర్యాంకులతో అత్యున్నత స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.

దరఖాస్తుకు,గురుకుల స్కూళ్లకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800–425–45678 నంబర్‌లో లేదా http://tswreis.in, http://tresidential. cgg.gov.in, http://tgtwgurukulam. telangana.gov.in, http://mjptb cwreis.cgg.gov.in, http://tgcet.cgg. gov.in వెబ్‌సైట్‌లను చూడాలని సెట్‌ చీఫ్‌ కన్వీనర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.