
సత్తుపల్లి, వెలుగు: గంజాయి కేసులో ఇద్దరు మైనర్లతో పాటు ఓ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఖమ్మం జిల్లా సత్తుపల్లి సీఐ శ్రీహరి తెలిపారు. పట్టణంలోని మార్కెట్ గోదామ్ వద్ద రేజర్ల గ్రామానికి చెందిన సింహాద్రి సందీప్ గంజాయి విక్రయిస్తుండగా ఎస్సై అశోక్‌కుమార్ పట్టుకున్నట్లు చెప్పారు. గంజాయి కొంటున్న వారిలో ఇద్దరు పారిపోగా, ఇద్దరు మైనర్లతో పాటు సందీప్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద 632 గ్రాముల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆదివారం నిందితులను రిమాండ్ కు పంపించామని తెలిపారు.