కొందరు నేతల తీరుతోనే భద్రకాళికి బోనం ఎత్తలే ..దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

కొందరు నేతల తీరుతోనే భద్రకాళికి బోనం ఎత్తలే ..దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని భావించానని, కానీ కొందరు నేతల తీరుతో వెనక్కి తగ్గినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. సొంత గ్రామమైన వరంగల్‍  జిల్లా గీసుగొండ మండలం వంచనగిరి పరిధిలోని మైసమ్మ అమ్మవారికి ఆదివారం కూతురు సుస్మితతో కలిసి మంత్రి బంగారు బోనం సమర్పించారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించే విషయంలో కొందరు నెగటివ్‍  ప్రచారం చేశారని తెలిపారు. ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్మవారికి బోనం సమర్చించుకోవచ్చని తెలిపారు. వేద పండితులను సంప్రదించాకే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించే విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలిపారు.