
- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: భక్తులు మెచ్చేలా వేములవాడ రాజన్న, భీమేశ్వర ఆలయాలను డెవలప్ చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం వేములవాడ భీమేశ్వర ఆలయంలో రూ.3 .44 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమేశ్వర ఆలయంలో 7 షెడ్స్, సీసీ నిర్మాణాలు, క్యూలైన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా డెవలప్ చేస్తామని చెప్పారు. రూ.35 కోట్లతో చేపడుతున్న రాజన్న ఆలయ అన్నదాన సత్రం టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు.
కొద్ది రోజుల్లోనే రాజన్న ఆలయం, పట్టణం, భీమేశ్వర ఆలయాల అభివృద్ది పనులు పూర్తవుతాయని చెప్పారు. రాజన్న ఆలయ ఈవో రాధాబాయి, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, నాయకులు బింగి మహేశ్, చిలుక రమేశ్, కొమురయ్య, తోట రాజు, పుల్కం రాజు, అరుణ్ తేజ చారి, సిరిగిరి శ్రీకాంత్ పాల్గొన్నారు.