
న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్‌ల (ఐటీఆర్) దాఖలు తేదీని పొడిగించే ప్రతిపాదన లేదని కేంద్రం తెలిపింది. వీటిని ఫైల్ చేయడానికి గడువు శుక్రవారమే ముగిసిందని స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఐటీఆర్ ఫైలింగ్ గడువును పలుసార్లు పెంచారు. ఈ విషయమై రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ మాట్లాడుతూ ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు చేయడంలో ట్యాక్స్ పేయర్లు ఇబ్బందిపడటం లేదన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలవరకు మొత్తం 5.62 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని చెప్పారు. శుక్రవారం ఒక్కరోజే రూ 20 లక్షలకు పైగా రిటర్నులు అందాయని బజాజ్ చెప్పారు. కాన్పూర్‌లో జరుగుతున్న ఐటీ దాడులపై అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, పెర్ఫ్యూమ్ వ్యాపారులు హన్స్‌రాజ్ జైన్‌తోపాటు ఇతరుల ఆస్తులపై శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ జరిగిందని చెప్పారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దాడులు కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు.