మిగిలింది 4 గంటలే.. నామినేషన్లకు నేడే ఆఖరు రోజు

మిగిలింది 4 గంటలే.. నామినేషన్లకు నేడే ఆఖరు రోజు

వెలుగు: లోక్ సభ ఎన్నికల నామినేషన్లకు ఇక, నాలుగు గంటల టైమే మిగిలిఉంది. సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 3 గంటలవరకే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తారు. ఇప్పటిదాకా 17 లోక్ సభ నియోజకవర్గాల నుంచి 220 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. రిటర్నింగ్ అధికారుల (ఆర్వో) ఆఫీసులవద్ద రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఈవో రజత్ కుమార్ ఆదేశించారు. నామినేషన్ పత్రాలను తీసుకున్న టైంను వాటిపై నమోదు చేయనున్నారు. సాయంత్రం 3 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేషన్లను తీసుకోరాదని ఆర్వోలకు సీఈవో స్పష్టం చేశారు. నామినేషన్ తో పాటు ఫాం 26లోని అన్ని కాలమ్లను భర్తీ చేసే బాధ్యత అభ్యర్థులదేనని అధికారులు స్పష్టం చేశారు.