IPL 2025: ఐపీఎల్ సస్పెన్షన్ కారణంగా బీసీసీఐకి భారీ నష్టం.. ఒక్క మ్యాచ్‌కు ఏకంగా రూ. 125 కోట్లా..

IPL 2025: ఐపీఎల్ సస్పెన్షన్ కారణంగా బీసీసీఐకి భారీ నష్టం.. ఒక్క మ్యాచ్‌కు ఏకంగా రూ. 125 కోట్లా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్  2025 సీజన్ మధ్యలో నిలిపివేయడం భారత క్రికెట్ నియంత్రణ మండలికి పెద్ద నష్టంగా మారనుంది. ప్రస్తుతానికి వారం రోజులు ఈ మెగా లీగ్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్ మధ్య ప్రధాన వాటాదారులు,  ఫ్రాంచైజ్ యజమానులు, ఆటగాళ్ళు మాత్రమే కాకుండా.. హోస్ట్ ప్రసారకులు, స్పాన్సర్లు, ఇతరులు కూడా భారీ నష్టాన్ని చవిచూస్తారు. రద్దు చేయబడిన ప్రతి మ్యాచ్ వల్ల రూ.100 నుండి రూ. 125 కోట్ల వరకు ఆర్థిక నష్టాలు సంభవిస్తాయని అంచనా వేయబడింది. బీమా క్లెయిమ్‌ల తర్వాత కూడా రూ. 50 నుంచి 60 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 

పరిస్థితి తీవ్రమై టోర్నమెంట్ యొక్క మిగిలిన భాగాన్ని పూర్తిగా రద్దు చేస్తే.. హోస్ట్ ప్రసారకులు వారు ఊహించిన రూ. 5,500 కోట్ల ప్రకటన ఆదాయంలో దాదాపు మూడో వంతును కోల్పోయే అవకాశం ఉంది. ప్లేఆఫ్ టికెట్ ఆదాయాలు ఐపీఎల్, బీసీసీఐ లకు వెళ్తుండగా  మిగిలిన ఏడు హోమ్ లీగ్ మ్యాచ్‌ల నుండి వచ్చే టికెట్ల డబ్బులు ఆతిథ్య ఫ్రాంచైజీలకు కీలకమైన ఆదాయ వనరు. ఉదాహరణకు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి హోమ్ గ్రౌండ్ లో ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆర్సీబీ మ్యాచ్ లకు హై డిమాండ్ ఉండడంతో ఆ ఫ్రాంచైజీ భారీగా నష్టపోనున్నారు. 

►ALSO READ | PBKS vs DC: చేసిన పరుగులు వృధా: పంజాబ్, ఢిల్లీ మధ్య మళ్ళీ మొదటి నుంచి మ్యాచ్

మార్చి 22 నుంచి ఈ నెల 25 వరకు షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌18వ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంకా 16 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మిగిలున్నాయి. ఇందులో 12 లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు కాగా.. నాలుగు ప్లేఆఫ్స్ దశవి. గురువారం పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఢిల్లీ క్యాపిటల్స్ పోరుమధ్యలోనే నిలిపివేసినా.. ఇరు జట్లకూ పాయింట్లు కే టాయించలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరిగి నిర్వహిస్తారా? లేదా ఇరు జట్లకూ చెరో పాయింట కేటాయిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. 

ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నేపథ్యంలో మెగా లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు  బీసీసీఐ శుక్రవారం(మే 8) ప్రకటించింది. గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధంతరంగా నిలిపివేయడంతో మెగా లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనసాగడంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో  ‘ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2025 మిగిలిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తక్షణమే ఒక వారం పాటు నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది’ అని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు.